డ్ర‌గ్స్ మాఫియాను కాపాడేందుకు ప‌వ‌న్ కేసిఆర్‌తో భేటీ

pawan meets kcr
pawan meets kcr

హైద‌రాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశానికే తెలంగాణ ఆదర్శమని పవన్ అన్నారని… ఏ విషయంలో ఆదర్శమో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి కార్యక్రమంలో కేసీఆర్, పవన్ లు కలసినప్పుడే తనకు డౌట్ వచ్చిందని అన్నారు. డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కేసీఆర్ ను పవన్ కలిశారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ పెడ్లర్ కాల్విన్ పై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదో ప్రభుత్వం తెలపాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని… వపన్ కు దమ్ముంటే, నాతో వస్తే రైతుల వద్దకు తీసుకెళ్తానని చెప్పారు.