‘డోన్‌ కోర్టులో సం’చలనం

Law
Law

‘డోన్‌’ కోర్టులో సం చలనం

డిప్యూటీ సిఎం తనయుడిపైకేసు నమోదు
కెఇ శ్యాంబాబు అరెస్ట్‌కు వారంట్‌ జారీ
జడ్పీటిసి బొజ్జమ్మ, ఎస్‌ఐ తులసిలకు కూడా.

డోన్‌: చెరుకులపాడు నా రాయణరెడ్డి హత్యకేసులో డిప్యూటీ సిఎం తన యుడు కెఇ.శ్యాంబాబు పాత్రపై గత నాలుగురో జులుగా ఉత్కంఠతను రేపుతూ జరిగిన సాక్షుల విచారణ శుక్రవారం ఇచ్చిన సంచలనతీర్పుతో పులస్టాఫ్‌ పడినట్లైంది. తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తూ అసలైన దోషులను వదిలి వేశారని తెలుపుతూ న్యాయం కోసం హతుడి సతీమణి పత్తికొండ వైకాపా ఇన్‌చార్జి చెరుకుల పాడు శ్రీదేవి డోన్‌ కోర్టును ఆశ్రయించిన సంగతి పాఠకులకు విదితమే. గత మూడు నెలలుగా సుదీర్ఘమైన విచారణను చేపట్టిన డోన్‌ జూని యర్‌ సివిల్‌ జడ్జి ఆంజనేయులు శ్రీదేవి కోర్టులో వేసిన ప్రైవేటుకేసులో పేర్కొన్న సాక్షులందరిని విచారించిన అనంతరం తన ఆదేశాలను జారీ చేశారు. నారాయణరెడ్డి హత్యకేసులో డిప్యూటీ సిఎం కెయి క్రిష్ణమూర్తి తనయుడు కెయి శ్యాం బాబుపై తక్షణవేు హత్యానేరంకింద కేసును నమోదు చేస్తూ అరెస్ట్‌ వారంట్‌ను జారీ చేస్తు న్నట్లు ప్రకటించారు