డీజీపీగా సాంబ‌శివ‌రావు ప‌ద‌వీకాలం పొడ‌గింపు…

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీగా సాంబశివరావును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది. గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.