టిడిపి తీర్ధం పుచ్చుకున్న గిడ్డి ఈశ్వ‌రి

easwari ,mla
easwari ,mla

అమ‌రావ‌తిః వైఎస్ఆర్‌సిపిలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నది అని.. అందుకే టీడీపీలో చేరానని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సోమవారం ఆమె టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. తమ ప్రాంతంలో వైఎస్ఆర్‌సిపి బలోపేతం కోసం, గిరిజన సంక్షేమం కోసం ఎంతో శ్రమపడ్డాను, కానీ నా శ్రమను జగన్ గుర్తించలేదు అని అన్నారు. అందుకే ఆత్మాభిమానం దెబ్బతిని పార్టీ మారినట్లు చెప్పారు. కాగా హుదూద్ తుఫాను తర్వాత విశాఖ జిల్లాను అభివృద్ధి చేసిన సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తే.. గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, గిరిజన సంక్షేమం బాగుపడేందుకు టీడీపీలో చేరానని తెలిపారు. తాను గిరిజన పక్షపాతినని, గిరిజన హక్కుల కోసం ముఖ్యమంత్రి సహకారంతో కలిసి పని చేస్తానని అన్నారు. తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు తనను ఎన్నుకున్నారు.. ఆ బాధ్యతలను తప్పకుండా నిర్వర్తిస్తానని ఈశ్వరి పేర్కొన్నారు.