టిడిపికి మరో నేత గుడ్‌బై!

TDP
TDP

కడప: కడప జిల్లాలో టిడిపికి మరో నేత గుడ్‌బై చెప్పనున్నాడు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఖలీల్‌ బాషా టిడిపికి గుడ్‌ బై చెప్పి వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సాయంత్రం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌తో బాషా భేటి కానున్నారు. కడపలో 7 వ తేదీన జరుగుతున్న శంఖారావం సభలో ఆయన అధికారంగా వైఎస్‌ఆర్‌సిపి తీర్ధం పుచ్చుకోనున్నారు. తనకు టిడిపిలో తగినంత గుర్తింపు ఇవ్వడం లేదనే గత కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.