జీయంగార్లకు ఇకపై భారీ వేతనం

TTDJEEYA
TTDJEEYA

తిరుమల: తిరుమలతిరుపతిదేవస్థానంలోపనిచేసే జీయ్యంగార్ల వేతనాలను పెంచుతూ టిటిడిబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దజీయంగార్ల వార్షికవేతనం ప్రస్తుతం రూ.1.15 కోట్లు ఉండగా ఆ మొత్తం ఇకపై రూ.1.50 కోట్లకు పెంచారు. చిన్నజీయంగార్ల వేతనం కూడా రూ.79 లక్షలనుంచి రూ.1.09 కోట్లకు పెంచుతున్నట్లు టిటిడి వెల్లడించింది. ఛైర్మన్‌ పుట్టాసుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన సమావేశమైన పాలకమండలిబోర్డు సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. టిటిడి తీసుక్ను ఈ నిర్ణయంపట్ల జీయంగార్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా జీయంగార్లకు జీతభత్యాలతు పెంచారన్న వార్తలు బైటికి రాగానే సోషల్‌మీడియాలో నెటిజన్లు విమర్శలు ఎక్కువయ్యాయి. టిటిడిలో పనిచేసే పేదబ్రాహ్మణులకు కూడా జీతాలుపెంచాలని, ఇప్పటికే జీయంగార్లకు అంతస్థాయిలో జీతాలుండగా మళ్లీ పెంచిన రీతిలోనే పేద బ్రాహ్మణులకుసైతం జీతాలుపెంచాలని కోరుతున్నారు.