జిల్లాలో పలు గ్రామాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

ELECTRICITY
Electricty

నెల్లూరు: జిల్లాలో 20 గ్రామాలకు పైగా నేడు సుమారు ఐదు గంటల నుంచి అంధకారంలో ఉన్నాయి. బాలాయపల్లి
పరిధి సిద్దాగుంట ఫీడర్‌లోను, దీంతో పాటు గొలలపల్లి ఉప కేంద్రం పరిధి చిండలి గ్రామ ఫీడర్‌లో సాంకేతిక లోపం
రావడంతో సుమారు 20 గ్రామాలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 20
గ్రామాలు అంధకారంలో ఉండిపోతున్నాయి. విద్యుత అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజలు
కోరుతున్నారు.