జాగిలాలకు శిక్షణ: డిజిపి

AP POLICE DOG SQUAD
AP POLICE DOG SQUAD

విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత సరైన ప్రదేశం లేకపోవడంతో జాగిలాలకు శిక్షణ ఇవ్వలేకపోయామని ఏపి డిజిపి మాలకొండయ్య తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి జాగిలాలు ఎంతో ఉపయోగపడతాయని, కీలక కేసులు చేధించడంలో డాగ్‌ స్క్వాడ్‌ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన చెప్పారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన జాగిలాల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో మాలకోండయ్య పాల్గోన్నారు.ఇంటిలిజెన్స్‌ వింగ్‌ ఆధ్వర్యంలో ఐదు రకాల జాతులకు చెందిన జాగిలాలకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.