జగన్‌ స్వామీజీలను కలిసి దీవెనలు పొందడం మంచిదే: మంత్రి అయ్యన్న

ayyanna patrudu
ayyanna patrudu

విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల చిన్నజీయర్‌ స్వామిని కలుసుకోని ఆశీస్సులు పొందడంపై  మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌ స్వామీజీలను కలిసి దీవెనలు పొందడం మంచిదేనని,  అప్పుడైనా జగన్‌కు మంచి బుద్ధి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే, ప్రతి ఒక్కరికి దైవబలం అవసరమని,  అన్నారు. ఇక దేశంలో మహనీయులకు కూడా కుల గజ్జిని అంటకడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయులను అందరివారిగా గుర్తించాలని, మహనీయుల గురించి మాట్లాడే ముందు అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని  ఆయన హితవు పలికారు.