జగన్‌ బాహుబాలి: ఎమ్మెల్యే ఆర్కే రోజా

R K ROJA
R K ROJA

ఢిల్లీలో శివగామి(సోనియా గాంధీ), ఏపిలో భల్లాలదేవుడు(సీఎం చంద్రబాబు)ని తమ పార్టీ అధినేత జగన్‌ బాహుబలిగా ఎదురించారని వైఎస్సార్సీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి ఆయనను 16నెలలు జైల్లో పెట్టించారని అన్నారు. నేడు ఓ సమావేశంలో రోజా మాట్లాడుతూ జగన్‌ చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కోంటున్నారని వ్యాఖ్యానించారు. కాగా, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతను మోసపుచ్చుతున్నారని, ఆయనపై యువత తిరుగుబాటు చేస్తారని అన్నారు. నాలుగేళ్ల పాటు టిడిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. అటువంటి ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు.