జగన్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సిఎస్‌ సమీక్ష

ap cs, lv subramanyam
ap cs, lv subramanyam

అమరావతి: ఏపి సియం ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సచివాలయంలో సిఎస్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిజిపి ఠాకూర్‌, విజయవాడ సిపి, సిఆర్‌డిఏ కమీషనర్‌ శ్రీధర్‌, మునిసిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్‌, విజయవాడ మునిసిపల్‌ కమీషనర్‌ రామారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే ప్రదేశాన్ని ఖరారు చేయనున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/