జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్‌ ఖరారు

Y S Jagan 2
Y S Jagan

కర్నూలు: వైఎస్సార్సీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 12వ రోజుకు షెడ్యూల్‌ ఖరారైంది.. బనగాలపల్లి నియోజవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8గంటలకు జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 8.30 ఆయన ఆమదాల క్రాస్‌ రోడ్డుకు  చేరుకుంటారు. బనగాలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నె క్రాస్‌రోడ్‌కు చేరుకొని అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం  11.30 గంటలకు ఎల్లూరి కొత్తపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.30గంటలకు జగన్‌ భోజన విరామం తీసుకుంటారు.