జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ కేశినేని నాని

tdp mp nani
tdp mp nani

నంద్యాల: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌పై తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని విమర్శల వర్షం కురిపించారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, జగన్‌ కుయుక్తులు నంద్యాలలో పని చేయడం
లేదని, చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహారాన్ని తీసుకొచ్చే వాహనాన్ని కూడా వదల్లేదని, పాంట్రీకారును
తనిఖీ చేయించి, చివరకు అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని,
జగన్‌కు మౌత్‌ పీస్‌లా మారిన సాక్షి పత్రిక, ఛానల్‌ను బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హత్య రాజకీయ
చరిత్ర ఉన్న జగన్‌పై ఇప్పటికే 16కేసులున్నాయని.. అతను మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.