చంద్ర‌బాబును ఎద్దేవా చేసిన బొత్స‌

botsa
botsa

అమ‌రావ‌తిః చంద్ర‌బాబు భావించిన‌ట్లు లోకేష్ ఘ‌టికుడే ఐతే ఎందుకు నంద్యాలలో ప్రచారానికి పంపడం లేదని వైకాపా నేత
బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఒక్క రోజు బయటకు వచ్చి ప్రచారం చేస్తే, లోకేష్ బండారం బయటపడుతుందని ఎద్దేవా
చేసిన ఆయన, “బావమరిదిని పంపితే ఏదో చేసి వచ్చాడు, ఇక కొడుకును పంపితే ఇంకేదో చేసి వస్తాడు” అన్న భావనతోనే
తన కొడుకును ప్రచారానికి దూరంగా ఉంచాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా లోకేష్ యువ నాయకుడే అయితే,
ఓటర్ల ముందుకు రాకుండా వెనకెందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. నంద్యాలలో వైఎస్ఆర్‌సిపి గెలుపును ఎవరూ
ఆపలేరని స్పష్టం చేశారు.