చంద్రబాబు కుడిచేతికి స్వల్పగాయం

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు చేతికి స్వల్పంగా గాయమయింది. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు వచ్చారు. అయితే ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉంది. చేతినరంపై ఒత్తిడి పెరగడంతో వైద్యులు కట్టుకట్టినట్లు తెలిసింది. చేతికి కట్టుతోనే కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/