చంద్రబాబుకు లేఖ రాసిన రామకృష్ణ

ramakrishna
ramakrishna

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబుకు సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు, కౌలు రైతులకు అన్నదాత పథకం వర్తింపజేయాలని ఆయన కోరారు. జూన్‌లో కౌలు రైతుల్ని గుర్తించడం వల్ల వారికి లబ్ది చేకూరదని చెప్పారు. గతేడాది ఇచ్చిన గుర్తింపు కార్డుల ప్రకారం కౌలు రైతులకు కూడా రూ.10 వేల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డ్వాక్రా మహిళలకు ఒకే విడతలో రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చెక్కులు చెల్లకపోతే మహిళలు ఇబ్బంది పడాల్సివస్తుందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.