గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మంత్రి ప‌రిటాల సునీత‌

ap minister p.sunitha
ap minister p.sunitha

హైదరాబాద్‌: ఏపీ మంత్రి పరిటాల సునీత బుధ‌వారం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా
తన కుమారుడు శ్రీరామ్‌ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు
వచ్చిన ఆమె గవర్నర్‌కు శుభలేఖ అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి శుభలేఖ ఇచ్చినట్లు
తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిటాల రవికి అభిమానులు ఉన్నారని, పరిటాల కుటుంబంతో అనుబంధం ఉన్న
అందరినీ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు అమె చెప్పారు.