గుంటూరులో ఐటీ తనిఖీలు 

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

గుంటూరు: ఏపిలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం   జిల్లాలో ఐటీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. టిడిపి నేత, ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర ఇళ్లు, కార్యాయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. గత పదిరోజుల క్రితం జిల్లాలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు ఏకంగా టిడిపి మద్దతు దారుల కార్యాలయాలపై తనిఖీలు చేపట్టింది.