గ’ఘన’ విజయాలతో ‘షార్‌’ శాస్త్రవేత్తలకు ఘనసన్మానాలు

IMG--
IMG–

గ’ఘన’ విజయాలతో ‘షార్‌’ శాస్త్రవేత్తలకు ఘనసన్మానాలు

శ్రీహరికోట (తడ),: అంతరిక్షంలో భారత శాస్త్రవేత్తలు గఘన విజయాలు సాధిస్తూ ప్రజలు, ప్రముఖులచే వేనోళ్ల కొనియాడబడుతున్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఇందుకు వేదికయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గత ఐదు దశాబ్ధాలుగా సాధించిన అభివృద్ధికి నిదర్శనంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు సన్మానాలు అందుకుంటున్నారు. గత మూడురోజులుగా శ్రీహరికోటలోని సతీష్‌థవన్‌ అంతరిక్ష కేంద్రం ఆధ్వర్యంలో పలుచోట్ల ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంతరిక్ష విజానం గురించి విద్యార్థులకు, ప్రజలకు వివరిస్తుంటే ఆయాచోట్ల విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు శాస్త్రవేత్తలను కొనియాడుతున్నారు. ప్రపంచ ఐక్యతకు అంతరిక్షం అనే నినాదంతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు వారోత్సవాలు జరుపుతుంటే దేశంలోని వివిధ ముఖ్య పట్టణాలు, కళాశాలల్లో ఇస్రో సైతం అంతరిక్ష ప్రయోగాలు, వాటి విజయాల గురించి విస్తృత ప్రచారం చేస్తోంది.

శ్రీహరికోట శాస్త్రవేత్తలు సైతం ఐదు రాష్ట్రాల్లోని 13 కేంద్రాల్లో ఈ వారోత్సవాలు ప్రకటించింది. అయితే ఇంకా ఎక్కువచోట్ల ప్రస్తుతం కార్యక్రమాలు రూపొందించింది. వివిధ బృందాలుగా ఎంపిక చేసిన ప్రదేశాలకు వెళ్లిన శాస్త్రవేత్తలు అక్కడ సమావేశాల ద్వారా, ప్రదర్శనల ద్వారా, నడక ద్వారా అంతరిక్ష నినాదాన్ని, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పలు విద్యాలయాలు ఇందుకు ఆతిథ్యమివ్వడంతో విద్యావేత్తలు, విద్యార్థులు సైతం వీటిపట్ల ఆకర్షితులవుతున్నారు. మూడోరోజు శనివారం మరో నాలుగుచోట్ల ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలోను, గూడూరులోని ఆదిశంకర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోను, కర్ణాటకలోని కోసూరు ఆధ్యమాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోనుఒడిస్సాలోని బాలాసోర్‌ మోడరన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోను ప్రపంచ అంతరిక్ష్ష వారోత్సవాలు ప్రారంభించారు. వీటిలో గూడూరులో జరిగిన కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ ఎస్‌ పాండ్యన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని అంతరిక్షంలో భారత విజ్ఞానాన్ని వివరించారు. ప్రపంచంలో ఐకమత్యంగా అంతరిక్ష ప్రయోగాలు చేసుకొని సామాన్యులకు ఉపగ్రహ ఫలితాలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా పాండ్యన్‌ను అక్కడి విద్యావేత్తలు, ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సాలలోను ఈ సారి అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయాచోట్ల శనివారం కూడా శాస్త్రవేత్తలు, షార్‌ అధికారుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీహరికోటలో మాత్రం శనివారం కార్యక్రమాలకు విరామం కల్పించడం విశేషం.