కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

ap cabinet
ap cabinet

అమరావతి: సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపుపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్‌ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమైక్యాంధ్ర ఉద్యమం నాటి మిగిలిన కేసులు ఎత్తివేయాలని నిర్ణయించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పసుపు- కుంకుమ పథకం నిధుల పంపిణీకి, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.