కేంద్ర బడ్జెట్ తో ఏపీకి తీవ్ర అన్యాయం

GANTA
GANTA

కేంద్ర బడ్జెట్ తో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… ఏపీ ప్రజలను తీవ్ర నిరాశ పర్చారన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు రూ.4500కోట్లు ఇవ్వాలని చెబితే కేవలం రూ.245 కోట్లే కేటాయించారన్నారు. అమరావతి, పోలవరం ప్రస్తావన కనీసం లేకపోవడం దారుణమన్నారు. ఏపీ పట్ల కేంద్రం వివక్షతకు తార్కాణాలని భావించాల్సి వస్తోందన్నారు.