కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి

Rammohan naidu
Rammohan naidu

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో ధర్మపోరాట సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతు ప్రధాని మోడి పరిపాల పోతేనే రాష్ట్రనికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ఏపి ప్రజల కోసం సిఎం చంద్రబాబు ఢిల్లీ పెద్దలపై పోరాటం చేస్తున్నారుని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మపోరాటానికి వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని కేంద్రం వెనక్కి తీసుకుందని, విశాఖ రైల్వేజోన్‌పై కేంద్రం నోరుమెదపడం లేదని రామ్మోహన్‌ దుయ్యబట్టారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని మోడి కి చూపించాలన్నారు.