కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై నేడు లోక్‌స‌భ‌లో ప్రైవేటు బిల్లు

A SRINIVAS
A SRINIVAS

న్యూఢిల్లీః కేంద్రప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలుగు దేశం ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఈరోజు లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కాపుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి దేశాభివృద్ధి ఫలాలను వారికి అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌‌లో కాపులకు ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్ బిల్లు 2018ను ఉద్దేశించారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాలని అన్నారు.