కష్టలంకలో బాలుడి కిడ్నాప్‌.. 2లక్షలు కిడ్నాపర్ల డిమాండ్‌

Kidnapped
Child Kidnapped

విజయవాడ: నగరంలోని కృష్ణలంకలో శనివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. శివచరణ్‌(8) అనే బాలుడిని కిడ్నాప్‌
చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి రూ.2లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్‌ డిమాండ్‌ చేశారని,
నిందితుల్లో ఒకరు ఇంటర్‌ విద్యార్థి, మరోకరు ఆటోడ్రైవర్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్‌, మద్యం, జూదం
వంటి చెడు అలవాట్లకు నిందితుడు బానిసై ఉంటాడని, పందెంలో డబ్బులు పోగొట్టుకొని ఈ దారుణానికి పాల్పడి ఉంటారని
పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.