కనకదుర్గ ఆలయంలో టిక్కెట్ల అమ్మకాల్లో అవినీతి…

indrakeeladri
indrakeeladri

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయ దర్శన టిక్కెట్ల విక్రయాల్లో అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఒకే టిక్కెట్‌ నెంబర్‌తో అనేక దర్శన టిక్కెట్లు విక్రయిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొట్టారు. ఆలయంల అధికరద్దీ రోజుల్లోనూ తక్కువ ఆదాయం రావడంతో ఈవోకి అనుమానం వచ్చింది. దీంతో, టిక్కెట్ల విక్రయాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఈ అవినీతి బాగోతం బయిటపడింది. ఎప్పటినుంచి ఈ అవినీతి తతంగం జరుగుతోందనే విషయమై సంబంధిత అధికారులు దృష్టి పెట్టారు. లక్షలాది రూపాయల ఆలయ ఆదాయానికి గండిపడి ఉంటుందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.