కడప ఉక్కు మా హక్కు..

TDP MPS-
TDP MPS-

కడప ఉక్కు మా హక్కు..

కేంద్ర ఉక్కుమంత్రిని కలిసిన టిడిపి ఎంపీలు
విభజనహామీల అమలుపై మంత్రి నిలదీత
కడప ఉక్కు కర్మాగారంపై వారంలోపు నిర్ణయమన్న మంత్రి
కర్మాగారం నిర్మించితీరుతామన్న పార్లమెంటు సభ్యులు

అమరావతి: రాష్ట్ర విభజన చట్టం అమల్లో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు హామీని తక్షణమే అమలు చేయాలని,రాష్ట్రవ్యాప్తంగా ఐదుకోట్ల ఆంధ్రులు ధర్మపోరాటం చేస్తుండడం,ఉక్కు కర్మాగారంకోసం తమ ఎంపీ సీఎం రమేష్‌ 11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసినా కేంద్రం చలించడమేలేదని శనివారం ఏపి టిడిపి రాజ్య సభ, లోక్‌సభ సభ్యులు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలసి డిమాండ్‌చేశారు.అలాగే విభజనహామీలను కేంద్రం అమలు చేయకూడ దని నిర్ణయించుకొని తమ న్యాయపోరాటాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ఎదురుదాడికి దిగుతోం దని ఎంపీలు కేంద్ర నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించారు. కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకొన్న ఏపి ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటు చేసి చూపుతామని కొంతమంది ఎంపీలు కేంద్రమంత్రితో ప్రస్తావించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనువైన భూమి, నీరు, విద్యుత్‌, మౌలిక సదుపాయాలు,ఐరన్‌ ఓర్‌ సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమాజీమంత్రి టిడిపి ఎంపీ సుజనాచౌదరి,ఎంపీ సీఎం రమేష్‌ మంత్రికి మరోమారు గుర్తుచేశారు.