కంటతడి పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

ap minister acchennayudu
ap minister atchennaidu

శ్రీకాకుళం: దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం గురువారం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి
హాజరైన ఆయన సోదరుడు, మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టారు. ఎర్రన్నాయుడితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తన సోదరుడు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది తన సోదరుడు అకాంక్షించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వచ్చే రెండేళ్లలో తన సోదరుడి కలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని ఇప్పటికే జిల్లాలో ప్రాధాన్యతా క్రమంలో సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.