ఒకటి మ‌ర‌వ‌క ముందే మ‌రో ఘ‌ట‌న‌

RAPE
RAPE

గుంటూరుః జిల్లాలో దాచేపల్లి ఘటన మరువకముందే మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. చుండూరు మండలం మోదుకూరులో 7 ఏళ్ళ బాలికపై నాగూల్ మీరా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు.