ఐలయ్య గృహ నిర్భంధంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాం: ఏపి డిజిపి

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

ఆచార్య ఐలయ్య రచన గావించిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై వివాదం చెలరేగుతోన్న విషయం
తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐలయ్యకు మద్ధతుగా విజయవాడలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి లేదని,
ఆయనను గృహ నిర్భంధం చేయాలని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడానని ఏపి డిజిపి సాంబశివరావు అన్నారు.
కులాలు, మతాలకు సంబంధించిన సభలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. లోగడ కాపుల
సభ నేపథ్యంలో తునిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. రేపు
విజయవాడలో తలపెట్టిన కంచ ఐలయ్య సభకు గానీ, ఆర్యవైశ్య సభకు గానీ అనుమతులు ఇవ్వలేదని డిజిపి
సాంబశివరావు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే అరెస్ట్‌ చేస్తామని
హెచ్చరించారు.