ఐటి అధికారుల వేధింపులతో వ్యాపారి ఆత్మహత్య

IMG
IMG

ఐటి అధికారుల వేధింపులతో వ్యాపారి ఆత్మహత్య

విజయవాడ: ఐటి అధికారుల వేదింపు లకు ఓ వ్యాపారి ఆత్య హత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా పెనమ లూరు మండలం కానూరులోని సనత్‌నగర్‌కు చెందిన సాధిక్‌ 25 ఏళ్ళుగా విజయవాడలోని అటోనగర్‌లో లారీలకు బాడిబిల్డింగ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జీఎస్‌టి అమలులోకి రాకముందు వరకు ఈ వృత్తి చేతివృత్తులలో ఒకటి.ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత ఇక్కడ తయారయ్యే ప్రతివస్తువుపై జిఎస్‌టి విధిస్తున్నారు. సాధిక్‌ కొన్ని నెలలుగా ఐటి రిటర్న్స్‌ ధాఖలు చేయ్యక పోవడంతో ఆ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.

దాంతో ఆయన నగరంలోని ఒక చార్టెడ్‌ అకౌంటెంట్‌ను ఆశ్రయిం చారు.జిఎస్‌టి నుంచి మినహాయింపు పొందేలా రిటర్న్స్‌ రూపొందిం చారు.బాడిబిల్డింగ్‌ యూనిట్లో పనిచేస్తున్న 5,6గురు కార్మికులను వ్యాపారసంస్దలో భాగస్వామ్యం వున్నట్లు చూపించారు.ఐటి అధి కారులు ఈ ఐదుగురిని విచారించగా వారు కార్మి కులే అని తేలింది.దీంతో సాధిక్‌కు ఐటి అధికారులు రూ 50 లక్షలు జరిమానా విధించారు.దీనిపై షాధిక్‌ ఐటి అధికారులను వేడుకోగా రూ 15 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని అన్నారని షాధిక్‌ సహచరులకు చెప్పినట్లు మృతుడి బందువులు అరోపిస్తున్నారు

.ఈ నేపథ్యంలో ఐటి అధికారుల నుంచి ఎక్కువ ఫోన్లు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికిలోనైన షాధిక్‌ అదివారం తెల్లవారు జామున ఇంటి నుండి బయటకు వచ్చాడు.అనంతరం బందర్‌ కాలువలోదూకి అత్యహత్య చేసుకున్నాడు, సోమవారం రాత్రి తోట్లవల్లూరు కాలువలో సాధిక్‌ మృతదేహం తేలింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.అయితే దీనిపై షాధిక్‌ కు జిఎస్‌టి నుండి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని ఎటువంటి వేదింపులు జరగలేదని అశాఖ ఉన్నత అధికారులు తెలిపారు.తమ జాబితాలో షాధిక్‌ పరిశ్రమ లేదని నోటీసులతో తమకు సంభంధం లేదని అధికారులు తేల్చి చెప్పారు.దీంతో కేసు మిష్టరీగా మారింది.