ఏపి స‌చివాల‌యంలో ఉద్యోగుల‌ నిర‌స‌న‌

ap secretariat
ap secretariat

అమ‌రావ‌తిః ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో చేస్తున్న ఆందోళనకు మద్దతుగా అమరావతి సచివాలయంలోని ఉద్యోగులు ర్యాలీ చేశారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు. ఏపీ ప్రజలతో ఆడుకోవద్దని, న్యాయం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. అన్యాయంగా ఏపీని విభజించారని ఆరోపించారు.
విభజన హామీల కోసం పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నారని, హామీలు నెరవేర్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మురళీకృష్ణ స్పష్టం చేశారు.