ఏపి మంత్రిని పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi ,kannababu
Chiranjeevi ,kannababu

కాకినాడ: ఏపి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్‌ గుండెపోటుతో హఠ్మాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో కన్నబాబు బడ్జెట్‌ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. ఈరోజు సురేష్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కన్నబాబును పరమర్శిచాడానికి మెగస్టార్‌ చిరంజీవి వచ్చారు. అయితే కురసాల కన్నబాబు 2009 ఎన్నిక‌ల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యంలో కురసాల కీలకనేతగా కూడా వ్యవహరించారు. అలా చిరంజీవితో కన్నబాబుకు మంచి స్నేహబంధం ఏర్పడింది. కాగా పరామర్శకు వచ్చిన చిరు కొన్ని నిమిషాల వ్యవధిలోనే కాకినాడ నుంచి వెళ్లిపోయారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/