ఎమ్మెల్యె ప్రభాకర్‌ చౌదరిని ఆరోపిస్తున్న: జెసి దివాకర్‌రెడ్డి

JCFF
JC

అనంతపురం: టిడిపి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంది. వర్గ విభేదాలతో ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యె ప్రభాకర్‌ చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాకర్‌పై జెసి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యె అడ్డుపడుతున్నారని. ఆరోపించారు. ప్రభాకర్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మున్సిపల్‌ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.