ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచిన బాల‌య్య‌

baalaiah road show
baalaiah road show

నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బులు పంచారు. బాలకృష్ణ డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను రోడ్‌ షోలో ఏకరువు పెట్టిన బాలకృష్ణ.. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యాలని నంద్యాల ప్రజలను కోరి.. మళ్లీ అదే వాహనం మీది నుంచి వారికి డబ్బులు పంచడం విస్మయానికి గురి చేస్తోంది. బాలకృష్ణ డబ్బులు పంచుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ రోడ్‌ షోలో మాట్లాడుతున్నారు.