ఎఒబిలో పేలిన లాండ్‌మైన్‌

aob (File)
aob (File)

ఎఒబిలో పేలిన లాండ్‌మైన్‌

తృటిలో తప్పించుకున్న కూంబింగ్‌ బలగాలు

విశాఖపట్నం: మావోలను లక్ష్యంగా చేసుకొంటూ పోలీసులు వారిని కడతేర్చే పనిలో మావోలు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారు. తాజాగా ఆంధ్ర, ఒడిశా కటాఫ్‌ ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందడంతో పాటు నలుగురు సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. ఇది జరిగి ఒక రోజు కాలేదు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా గుమ్మా బ్లాక్‌ పనసపట్టు సమీపంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కసారిగా ల్యాండ్‌ మైన్‌ పేలడంతో పోలీసులు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చెల్లాచెదురయ్యారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బలగాలు వెనుదిరగకుండా తిరిగి మావోల వేటలో పడ్డారు. అదే ప్రాంతంలో ఉన్న మరికొని ల్యాండ్‌ మైన్లను పోలీసులు గుర్తించి వాటిని తొలగించారని తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ముఖ్యంగా జరిగిన సంఘటనపై అటు ఒడిశా పోలీసులు, ఇటు ఆంధ్రా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏపీ నుంచి మరిన్ని బలగాలను ఏవోబీ ప్రాంతంలో మొహరింపజేస్తున్నారు.