ఊబిలో పడి ఏనుగు మృతి

elephant stuck mud
elephant stuck mud

కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దుగ్గి సమీపంలో నాగావళి నదీతీరాన ఊబిలో కూరుకుపోయిన ఓ ఏనుగు మృతి చెందింది. ఈవిషయం నిన్న తెలిసింది. ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా కొమరాడ మండలానికి సెప్టెంబర్‌ 13న ఎనిమిది ఏనుగులు గుణానపురానికి చేరుకున్నాయి. అందులో ఒకటి విద్యుదాఘాతం కారణంగా చనిపోయింది. మిగిలిన ఏడింటిలో ఒకటి విడివడి కళ్లికోట, దుగ్గి ప్రాంతంలో ఉండిపోయింది. అటవీ అధికారులు వీటన్నింటినీ ఒకేచోటుకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 22న ఆరు ఏనుగులు జియమ్మవలస మండలం బిత్రపాడు వద్దకు చేరుకున్నాయి. విడిపోయిన ఏనుగు ఎక్కడుందో అని వెతుకుతున్న అధికారులకు సోమవారం ఏనుగు కళేబరం కనిపించింది. నది ఒడ్డు నుంచి నడుస్తున్న క్రమంలో ఊబిలో కూరుకుపోయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు.