ఈరోజు ఏపి కేబినెట్‌ సమావేశం

ap cabinet
ap cabinet

అమరావతి: ఈరోజు ఉదయం ఏపి సచివాలయంలో ఏపి మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 10.30 గంటలకు మంత్రివర్గం సమావేశంకానుంది. ఏలూరు, కడప, ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది  .అంతేకాక ఇనామ్‌ యాక్ట్‌ 2013 చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరుగనుంది. వీటితో పాటు ఏపీ అసైన్‌మెంట్‌ యాక్ట్‌ 1977కు చట్టసవరణపై, అసైన్డ్‌ భూముల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిపై మంత్రివర్గం చర్చించనుంది. దొనకొండ ఇండస్ట్రియల్‌ మెగా హబ్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.