ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదం

TS AP
TS ,AP

హైదరాబాద్‌: ఏపి, తెలంగాణల మధ్య మరో వివాదం తలెత్తింది. హైదరాబాద్‌లో ఉన్న ఫిల్మ్‌, టివి అండ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ అభివృద్ధి సంస్థ భవనంలో తమ వాటా అమ్మకానికి ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో జారీపై తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. తెలంగాణ సిఎస్‌ జోషి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇది విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ సంస్థ అని, ఇంకా విభజన కాని, ఏపి భూభాగంలో లేని భవనాన్ని ఎలా అమ్మకానికి పెడతారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్ట విరుద్ధం అని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.