ఇరు పార్టీల డ్రామాలుః జైరామ్‌

Jairam ramesh
Jairam ramesh

తిరుప‌తిః విభజన  చట్టం అమలులో కేంద్రంలోని ఎన్డీయే పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ అన్నారు. తిరుపతిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలో లోపాలు ఉన్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలని, అందుకు తాము మద్దతు ఇస్తామన్నారు. పోలవరం విషయంలో చట్టంలోని నిబంధనలను తుంగలోకి తొక్కారని జైరాం రమేష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉండగా…ఏపీ సర్కార్ దానిని నిర్మిస్తున్నదని, తమకు అనుకూలమైన, నచ్చిన కాంట్రాక్టర్లు పనులు అప్పగించారని జైరాం రమేష్ ఆరోపించారు.