ఆస్ప‌త్రుల అభివృద్ధికి దాత‌లు ముందుకు రావాలిః మంత్రి కామినేని

ap Minister-Kamineni-Srinivas
ap Minister-Kamineni-Srinivas

కృష్ణాః మచిలీపట్నం జిల్లా ఆస్పత్రిలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం, అంబులెన్స్‌ను ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సౌకర్యాలు, పారిశుధ్యం మెరుగుపర్చడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల విశ్వసనీయతను మెరుగుపర్చగలిగామని అన్నారు. ఈ సందర్భంగా దాతల సహకారాన్ని మంత్రి కొనియాడారు. ఆస్పత్రుల అభివృద్ధికి ఇదే రీతిలో  మరింత మంది దాత‌లు ముందుకురావాలని కోరారు.