ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి క‌ళా

KALA VENKATARAO
KALA VENKATARAO

శ్రీ‌కాకుళంః రణస్థలం మండలం పాతర్లపల్లిలో రూ.1.18 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రాష్ట్రఇంధన శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు. రూ. 80 లక్షలు సివిల్ పనులకు, మిగిలిన మొత్తంతో పరికరాల ఏర్పాటు చేయగా.. 48 వేల మంది జనాభా వైద్య అవసరాలను తీర్చనున్న పి.హెచ్.సి భవనంలో అల్లోపతి, ఆయుష్ విభాగాలకు ప్రత్యేక గదులు నిర్మాణం చేశారు. లాబ్, మహిళా, పురుష వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.