ఆమంచి పార్టీని వీడిన నష్టాం లేదు

N. Chandrababu
N. Chandrababu

అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సిఎం చంద్రబాబు ఈరోజు ఉదయం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడిన ఎలాంటి నష్టాం లేదన్నారు. ఆయకు ఎంతో గౌరవాన్ని ఇచ్చాం. కానీ కృష్ణమోహన్‌ దాని నిలుపుకోలేకపోయారని చంద్రబాబు అన్నారు. బిజీగా ఉన్నా ఆమంచితో గంట సేపు మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.700 కోట్లు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.