ఆధార్‌ వివరాలను సరిదిద్దుకోండి

UIDAI
UIDAI

అమరావతి: ఆధార్‌ కార్డులో తప్పులను రాష్ట్ర పెన్షనర్లు సరిదిద్దుకోవాలని పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య సూచించారు. దీనికోసం యూఐడీఏఐ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అవకాశం కల్పించిందని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షన్‌దారులు ఆధార్‌ శాశ్వత నమోదు కేంద్రాలకు వెళ్లి చిరునామా, వేలిముద్రలు, ఫోటోలను మార్చుకోవడం వల్ల నేరుగా పెన్షన్‌ ఖాతాలోకి చేరుతుంది.