అసెంబ్లీ సమావేశాలకు నేనే వచ్చాను, నన్నెవరూ రమ్మనలేదు

roja
roja, ysrcp mla

అమరావతి: ఎమ్మెల్యే రోజాకు అమరావతి రావాలంటూ ఏపి సియం జగన్‌ నుంచి కబురు వచ్చిందనే వార్తలలో ఏ మాత్రం సత్యం లేదని సినీనటి రోజా అన్నారు. తనను ఎవరూ అమరావతికి రమ్మని ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. అలాగే నామినేటెడ్‌ పోస్టు ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు. సోమవారం విజయవాడకు వచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ..రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వచ్చానన స్పష్టం చేశారు. కులాల ఈక్వేషన్‌ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని అంతేకాని తాను మంత్రి పదవి దక్కలేదని అలకబూనలేదని, ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/