అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టిడిపి ఎంపి

KESINENI NANI
KESINENI NANI

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని విపక్ష నేతలంతా పట్టుబట్టారు. టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. ఐతే దీనిపై ఇప్పుడే చర్చ జరగాలంటే కుదరదని, 10 రోజుల్లోపు ప్రకటిస్తానని స్పీకర్‌ చెప్పారు. స్పీకర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారు. దానికి సమాధానంగా స్పీకర్‌ నిబంధనల ప్రకారమే అవిశ్వాసం నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.