అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష

TOTA VAANI
TOTA VAANI

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న తన భర్త పోరాటానికి మద్దతు తెలపడమే కాదు.. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ లోక్ సభా పక్ష నేత తోట నర్సింహం సతీమణి తోట వాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. అమరావతి నుంచి హస్తినా వరకు ఇదే నినాదం మారుమోగుతోంది. నమ్మించి గొంతుకోశారంటూ బీజేపీ నేతలపై చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రగిలిపోతున్నారు. ఈ ఉద్యమంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టీడీపీ లోక్‌సభా పక్ష నేత తోట నర్సింహం సతీమణి.. తోట వాణి ఈ సారి ఢిల్లీ వేదికగా స్వరం వినిపించారు. వాణితో పాటు.. ఇతర ఎంపీల సతీమణులూ ఆందోళనలో పాల్గొన్నారు.