అనిశా వలలో పురపాలక ఉద్యోగి

ACB
ACB

మాచవరం: పురపాలకశాఖలో అవినీతి అధికారి అవినీతి అధికారుల(ఏసబి)కు చిక్కారు. బిల్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధవరావు నివాసంలో అనిశా అధికారులు బుధవారం సోదాలు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్నా అభియోగంపై గుంటూరు, పొన్నూరుతో పాటు 9ప్రాంతాల్లో ఏసిబి సోదాలు జరిపింది. ఇప్పటివరకు రూ.6కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మాధవరావుకు చెందిన నాలుగు ఇళ్లు, 20ఇంటిస్థలాలను అధికారులు సోదాలో గుర్తించారు. ఇంట్లో రూ.7లక్షల నగదుతో పాటు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.