టిడిపి నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

చంద్రబాబుకు మతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం అలవాటుగా మారింది

amjad basha
amjad basha

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ తీరుపై డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మండిపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసమే మూడు రాజధానుల బిల్లు పెట్టడం జరిగిందన్నారు. అయితే, దానికి విఘాతం కలిగేవిధంగా ఛైర్మన్ ప్రవర్తించారని విమర్శించారు. నేడు అనంతపురం పర్యటనకు వచ్చిన బాషా మీడియాతో మాట్లాడుతూ, టిడిపి నేతలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఛైర్మన్ తనను ఎవరూ దూషించలేదని, ప్రలోభ పెట్టలేదని చెబుతున్నప్పటికీ.. టిడిపి నేతలు వైఎస్సార్‌సిపి పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. మండలి రద్దుపై సమగ్ర చర్చ సాగిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/