పావు శాతం రుణాల వడ్డీ రేటు తగ్గింపు

andhra bank
andhra bank

హైదరాబాద్: ప్రభుత్వరంగ ఆంద్రాబ్యాంక్ పావు శాతం మేరకు రుణాల వడ్డీ రేటును తగ్గించింది. దీంతో 8.20 శాతం నుంచి 7.95 శాతానికి రేటు దిగిరానుంది. తగ్గించిన ఈ వడ్డీ రేట్లు ఈనెల 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక రోజు, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఈ ఐదు కాలపరిమితులకు 25 బేసిస్ పాయింట్ల మేరకు ఎంసిఎల్‌ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు)ను తగ్గిస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ కె.రాజేంద్ర కుమార్ ప్రకటించారు. దీంతో ఖాతాదారులు లబ్ధి పొందనున్నారని, వారి రుణ భారం గణనీయంగా తగ్గనుందని అన్నారు. తగ్గించిన వడ్డీ రేట్లతో గృహ, వాహన, వ్యక్తిగత, వ్యాపార రుణగ్రస్తులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. త్వరలో రెపో రేటు ఆధారిత డిపాజిట్, రుణ ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని అన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/