వడ్డీ రేట్లను తగ్గించిన ఆంధ్రా బ్యాంక్‌

Andhra Bank
Andhra Bank

హైదరాబాద్‌: ఆంధ్రా బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించింది. ఎంసిఎల్‌ఆర్‌(మార్జినల్‌ కాస్ట్‌ ఫండ్స్‌ లెండింగ్‌ రేట్‌)ను ఐదు కాలపరిమితులకు తగ్గించింది. ఈ తగ్గించిన వడ్డీ రేట్లను ఫిబ్రవరి 15 నంచి అమల్లోకి రానున్నాయి. ఒక రోజు, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది వంటి ఐదు కాలపరిమితులకు వడ్డీ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఒక రోజుకు 7.75 శాతం, నెల రోజులకు 7.80 శాతం, మూడు నెలలకు 8 శాతం, ఆరు నెలలకు 8.15 శాతం, ఏడాదికి రూ. 8.20 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ నిర్ణయించింది. ఇంకా సూక్ష్మ, మధ్యతరహా రుణాల వారోత్సవాల్లో భాగంగా ఆంధ్ర బ్యాంక్ ఆధ్వర్యంలో లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ వారు ప్రగతి నగర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర బ్యాంక్ డిజిఎం డివి ధనుంజయ రావు, ఎజిఎం జి పూర్ణ చంద్రరావు, ఎస్‌ఎంఇ ఎజిఎం నరేష్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం భుజంగ రావు, వివిధ శాఖ బ్యాంక్ మేనేజర్లు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ డిజిఎం మాట్లాడుతూ, వివిధ రకాలైన రుణాలు, వాటి వివరాలు తెలియజేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/